జాతీయం (National) వార్తలు (News)

ఇది గ్యాస్ బండ కాదు.. గుదిబండ!!

మరలా వంటగ్యాస్ బండ ధర పై రూ.25 పెంచగా అది ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దిల్లీ, ముంబయిలో ఒక సిలిండర్ ధర రూ.859.50గా ఉంది. కోల్‌కతాలో అత్యధికంగా రూ.886కి చేరుకుంది. ఇప్పటికే జులై 1న ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 12 వరకు సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •