ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

బెల్లంతో ఫేస్ ప్యాక్ వేయొచ్చని మీకు తెలుసా??

బెల్లం అంటే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ చాలా ఇష్టపడుతారు. ఎంతో రుచి కలిగిన బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అనేక జబ్బులను నివారిస్తుంది. చాలా మంది తీపి కోసం పంచదార కంటే బెల్లాన్ని ఎక్కువగా ఫ్రివర్ చేస్తుంది. అయితే ఆరోగ్య పరంగానే కాదు. చర్మ సౌందర్యాన్ని మెరుగు పరచడంలోనూ బెల్లం ఉపయోగపడుతుంది. మీరు విన్నది నిజమే! బెల్లంలో ఉండే మినరల్స్‌, విటమిన్స్‌ మరియు ఇతర పోషకాలు చర్మం సౌందర్యాన్ని రెట్టింపు చేయగలవు. మరి స్కిన్‌కు బెల్లాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బెల్లం తరుము, మూడు స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పెసర పిండి, ఒక స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకుని అపై ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు డ్రై అయిన అనంతరం చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేశారంటే పింపుల్స్‌, పింపుల్ మార్క్ పోయి ఫేస్ తెల్లగా మెరిపి పోతుంది.

అలాగే ఒక బౌల్‌ తీసుకుని అందులో ఒక స్పూన్ బెల్లం తరుము, రెండు స్పూన్ల పచ్చి పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముల్తానీ మట్టి యాడ్ చేసి మిక్స్ చేసుకుని ఫేస్ కు అప్లై చేసుకోవాలి. కాసేపు ఆరనిచ్చి అప్పుడు గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఈ ప్యాక్ వల్ల ముఖం తేమగా, మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది.

ఇక బౌల్‌లో ఒక స్పూన్ బెల్లం రుచిము మూడు స్పూన్ల వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల చందనం పొడి, ఒక స్పూన్ నిమ్మ రసం యాడ్ చేసుకుని కలిపిన మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. పావు గంట లేదా ఇరవై నిమిషాల పాటు డ్రై అయిన అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే డార్క్ స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది. నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •