క్రైమ్ (Crime) వార్తలు (News)

రాజు మృతిపై ఎలాంటి అనుమానాలకు తావు లేదు: డీజీపీ!!

సైదాబాద్‌ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు మరణంపై కుటుంబసభ్యులు, పలు ప్రజా సంఘాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలపై డీజీపీ స్పందిస్తూ ఎలాంటి అనుమానాలకూ తావు లేదని స్పష్టం చేశారు. రాజు ఆత్మహత్యపై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని అన్నారు.

గ్యాంగ్‌మన్‌ కూడా నిందితుడు ట్రాక్‌పై తిరగడం చూశారు. రాజు రైలు కింద పడటం రైతులు సహా ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారు. కోణార్క్‌ రైలు లోకో పైలట్లు రాజు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులు. ఈ ఘటనలో ఎలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిరాధార ఆరోపణలు తగదు అని డీజీపీ హితవు పలికారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •