దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12,45,402 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 7,145 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్లకి చేరింది. నిన్న ఒక్కరోజే 289 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,77,158 కి చేరింది. గత 24 గంటల్లో 8,706 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.41 కోట్లకు చేరింది. దేశంలో క్రియాశీల కేసులు 84,565కి తగ్గాయి.