తెలంగాణలో గురువారం స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ 2021 అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్, వొకేషనల్ కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి.

ఇప్పుడు విద్యార్థులు ఇంటర్ బోర్డుతో పాటు ఇతర ప్రభుత్వ వెబ్‌సైట్లలో కూడా ఫలితాలు చూసుకోవచ్చు. https://tsbie.cgg.gov.in , http://examresults.ts.nic.in,http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలు చెక్ చేయొచ్చు https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో మార్క్స్ మెమో కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు. మార్క్స్ మెమో ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దామా..

విద్యార్థులు https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత TSBIE IPE 2021 Mark’s Memos సెక్షన్‌లో ఫస్ట్ ఇయర్ జనరల్, ఫస్ట్ ఇయర్ వొకేషనల్, జనరల్ బ్రిడ్జి కోర్స్, వొకేషనల్ బ్రిడ్జి కోర్స్ మార్క్స్ మెమోస్‌కు వేర్వేరు లింక్స్ ఉంటాయి. విద్యార్థులు తమకు కావలసిన లింక్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి Get Memo పైన క్లిక్ చేయాలి. Print పైన క్లిక్ చేసి తమకు కావాల్సిన ఫార్మాట్‌లో మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేయొచ్చు. మార్క్స్ మెమోపై విద్యార్థుల ఫోటో, సంతకం ఉంటాయి. విద్యార్థులు మార్కుల వివరాలన్నీ సరిగ్గా చూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉన్నట్టైతే ఇంటర్ బోర్డును సంప్రదించొచ్చు.

జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ బోర్డు ఇచ్చిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో మెమోలు డౌన్‌లోడ్ చేయొచ్చు. తెలంగాణ ఇంటర్ బోర్డు జారీ చేసిన ఫలితాల్లో తప్పులు ఉంటే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయొచ్చు. విద్యార్థులు తమకు వచ్చిన ఫలితాల్లో సందేహాలు ఉంటే తమ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలి

ఒకవేళ తమకు మార్కులు సరిగ్గా రాలేదని విద్యార్థులు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో తమ సమాధానాల పత్రాలు పొందొచ్చు. ఇందుకోసం విద్యార్థులు ఒక పేపర్‌కు రీకౌంటింగ్ కోసం రూ.100, రీవెరిఫికేషన్, ఆన్సర్ బుక్ స్కాన్డ్ కాపీ కోసం రూ.600 ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 22 చివరి తేదీ.

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు జనరల్ విభాగంలో మొత్తం 4,09,991 మంది హాజరైతే, 1,99,756 మంది పాస్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 49, 331 మంది పరీక్షకు హాజరు కాగా కేవలం 24,226 మంది మాత్రమే పాస్ అయ్యారు. జనరల్ లో 49 శాతం, ఒకేషనల్ లో కూడా 49 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.