హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈ వైద్య సంస్థలో డయాగ్నోస్టిక్స్‌లో పని చేసేందుకు కాంట్రాక్ట్‌ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు మీకోసం..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, హెల్పర్స్‌ పోస్టులు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెజలైజేషన్‌లో డిగ్రీ, ఎండీ/డీఎన్‌బీ (రేడియో డయాగ్నోసిస్‌)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు : ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ది డీన్‌, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌, 50082 అడ్రస్‌కు పంపించాలి. అభ్యర్థులను మొదట పని ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7,500 నుంచి రూ. 1,30,000 వరకు అందిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 27-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.