ఒకప్పుడు భారత్ లో చైనా వస్తువులనే ఎక్కువగా ఉపయోగించేవారు. వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే సరిహద్దుల్లో చైనాతో వివాదం మొదలైన నేపథ్యంలో చైనా వస్తువులను పూర్తిగీక్త్ నిషేదించింది.

భారత్ చైనా నుంచి దిగుమతిలనే కాకుండా చైనా కు సంబంధించిన అప్డేట్స్ ను కూడా నిషేధించింది. ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్ పూర్తిగా నిషేధించడంతో అటు చైనా కు వేల కోట్లు నష్టం వాటిల్లింది అని చెప్పాలి. చైనాను నిషేధించడమే కాకుండా అటు మేక్ ఇన్ ఇండియా లో భాగంగా ప్రతి వస్తువును కూడా స్వతహాగా భారత్లో తయారు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపింది.

చైనాతో సంబంధాలు మళ్లీ పెంచుకోకూడదనే నినాదంతో భారత్ ముందుకు సాగుతోంది. అయితే చైనాకు చెందిన యాప్స్ అన్ని నిషేధించడానికి కారణం భారతీయులకు సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారాన్ని చైనా యాప్ పేరుతో తస్కరిస్తోంది అన్న కారణంతో నిషేధం విధించింది. కానీ ఇప్పుడు ఏకంగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేసిన పని మాత్రం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. చైనా కు సంబంధించిన ఫోన్లు వస్తువులు జాబ్స్ అన్నింటినీ నిషేధిస్తూ ఎవరు వాడకూడదు అంటూ ప్రచారం కూడా చేస్తున్న సమయంలో ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా ఇస్రో చైనాతో ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది.

ఇలా ఇస్రో తో చైనా కు ఒప్పందం జరగడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ప్రస్తుతం చైనా కు సంబంధించిన మొబైల్ కంపెనీ ఒప్పో. ప్రస్తుతం భారత్ లో ఈ మొబైల్ కూడా వాడుకలో ఉన్నది. ఎమర్జెన్సీ మెసేజింగ్ సర్వీసెస్ కోసం ఒప్పో తో ఒప్పందం కుదుర్చుకుంది ఇస్రో. అయితే ఒప్పో చైనా కు సంబంధించిన అన్ని రకాల కంపెనీలు సమాచారాన్ని దొంగలిస్తాయ్ అనే కారణంతోనే భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా చైనాకు చెందిన మొబైల్ కంపెనీతో ఇస్రో ఒప్పందం ఎందుకు అని సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.