హైదరాబాద్‌లోని రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థ భారత ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందినది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో రీజనల్ కో-ఆర్డినేటర్స్‌, కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్‌, ఫైనాన్స్ అండ్ అడ్మిన్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండడంతోపాటు కంప్యూటర్ నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు. దరఖాస్తులను 22-01-2022 వ తేదీ వరకు మాత్రమే స్వీకరిస్తారు.