న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్టీపీసీ) లో 15 మెడికల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. భర్తీ కానున్న పోస్టుల వివరాలు: జనరల్‌ సర్జన్‌:08; స్పెషలిస్ట్‌(జనరల్‌ మెడిసిన్‌):07 . ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/డీఎన్‌బీ) ఉత్తీర్ణత. ఈ-4 గ్రేడ్‌ అభ్యర్థులకు నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వరకు చెల్లిస్తారు. ఈ-3 గ్రేడ్‌ అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు లభిస్తాయి.వాసక్తి గల అభ్యర్థులు జనవరి 27లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు చూడవలసిన వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/