అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి వెళ్లిన మున్సిపల్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. అదేంటంటే.. తమ కుటుంబ సభ్యులందరికి కరోనా ఉందని తమను దాటి ఎలా కూల్చివేస్తారని అక్రమంగా నిర్మించిన భవనంలో బైఠాయించారు. వారి తీరు చూసి అధికారులు వెనుదిరిగారు. హైదరాబాద్ శివారులోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధి కిస్మాత్ పురలో ఘటన జరిగింది. పోలీసుల బందోబస్తు మధ్య భవనాలను కూల్చివేయడానికి అధికారులు రెడీ అయిన నేపథ్యంలో కరోనా పేరుతో భవనం కూల్చివేతను యజమానులు అడ్డుకున్నారు.