వార్తలు (News)

ఇకపై హైదరాబాద్ లో 2019 ఎంవి(MV) యాక్ట్ కఠినంగా అమలు

హైదరాబాద్ లో కొత్తగా ట్రాఫిక్ నిబంధనలు సవరించనున్నారు.హెల్మెట్ ఖశ్చితంగా ఉండాలని ట్రాఫిక్ పోలీస్ లు ఎంత చెప్పిన వాహన దారుల్లో మార్పులు రాకపోవడం వల్ల ఇకపై ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారికి తగిన బుద్ది వచ్చేలా చర్యలు చేపట్టనున్నారు.2019 ఎంవి (MV) యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలి అనుకుంటున్నట్టుగా సైబరాబాద్ పోలీస్ లు చెప్పారు. అవి ఏంటంటే…హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ తొలిసారి పట్టుబడినప్పుడు 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు.రెండోసారి దొరికినప్పుడు శాశ్వతంగా లైసెన్స్ రద్దు అవుతుంది.వాహనం వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి.వీటిలో ఏ నిబంధన పాటించకుండా ఎక్కువసార్లు పట్టుబడినా కూడా లైసెన్స్ ను కోల్పోయే అవకాశము ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.