ఏపీ ముఖ్యమంత్రి నివాస సమీపంలో అంగన్‌వాడి టీచర్ మృతి.!

కడప జిల్లా, పులివెందుల్లో నారాయణమ్మ అనే అంగన్‌వాడి టీచర్ మృతి చెందారు.

కరోనా వ్యాక్సిన్ వికటించి మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.

రిమ్స్‌లో చికిత్స పొందుతూ నారాయణమ్మ మృతి చెందింది.

రిమ్స్ ఆసుపత్రి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది.

50 లక్షలు నష్టపరిహారం,  మృతురాలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.

ముందు ఎలాంటి జబ్బులూ లేవని, కరోనా వ్యాక్సిన్ వేశాక అనారోగ్యానికి గురైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.