క్రైమ్ (Crime)

చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ అనుమానాస్పద మృతి

ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) హైదరాబాద్ లోని రాయదుర్గం ఠాణా పరిధిలో ఉన్న ఆమె ఇంటిలో బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందారు.ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తున్న శిరిష్మకు మణికొండ ట్రయల్ విల్లస్కు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్దార్థ్ తో 2016 లో వివాహం జరిగింది.వీరు ఏడాది కాలంగా గచ్చిబౌలి డీ అడ్రెస్ అనే అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్నారు.వీరికి సంతానం లేదు.బుధవారం రాత్రి సిద్దార్థ్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి శిరిష్మ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించరు.వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు చెప్పారు.అక్కడ నుండి రాయదుర్గం పోలీస్ లి ఉస్మానియా మార్చురీ కి తరలించారు.ఆమె మృతికి కారణాలు తెలుసుకోవడానికి ఇంకా దర్యాప్తు చేయాలనీ పోలీసులు అంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.