వార్తలు (News)

ఉత్తరాఖండ్ లో 28 శరీర అవయవాల వెలికితీత

ఉత్తరాఖండ్ లో 28 శరీర అవయవాల వెలికితీత ఉత్తరాఖండ్లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం లో ఇప్పటి వరకు 61 మృతదేహాలు లభ్యమవ్వగా,మరొక 28 శరీర అవయవాలను వెలికితీసి వారిని గుర్తించే పనిలో పడ్డారు.ఈ విపత్తు సంభవించి ఇప్పటికి 2 వారాలు కావస్తున్నప్పటికీ తమ కుటుంబ సభ్యులు తిరిగివస్తారనే ఆశలు వదులుకున్నారు, మిగతావారు బతికుండే అవకాశం లేదని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు.ఈ నెల 7 వ తేదీన ధౌలీగంగ ఉప్పొంగిన తపోవనం విద్యుత్ కేంద్రం కొట్టుకుపోయిందని అందరికి తెలిసిన విషయమే!ఈ వరదల్లో మొత్తం 204 మంది గల్లంతవ్వగా ఇంకా విద్యుత్ కేంద్రంలో సొరంగంలో చిక్కుకున్నవారికోసం 13 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనేఉన్నాయి.సొరంగం మొత్తం నీటితో నిండిపోయిన కారణం గా ఆ నీటిని మోటార్ లతో తోడి,పేరుకున్న మట్టి తొలగిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.