వరుసగా 10 రోజుల నుండి దెలిసెల్,పెట్రోల్ ధరలు నిరాటంకంగా పెరుగుతూనే ఉన్నాయి.ప్రతిరోజూ ముందు రోజు రికార్డుని తిరగరాస్తున్నాయి.మరల గురువారం పెట్రోల్ మరియు దెలిసెల్ ఫై 35 పైసల చొప్పున పెరిగింది.హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.45, డీజిల్ ధర రూ.87.55 కు చేరిపోయింది.ఈ నెల ప్రారంభం తో పోల్చితే ఇప్పటికి పెట్రోల్ మీద రూ.3.68, డీజిల్ రూ.4.09 పెరగగా నిత్యావసరాలకు ఉపయోగించే ఎల్ పి జి సైలెండర్ పై రెండు దఫాలుగా రూ .75 పెరిగింది.