ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle)

భారత్ లో పెరుగుతున్న పోషకాహార లోపం

ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి.ఎంతో కష్టపడి ప్రగతి సాధించిన తరువాత ఈ విషయం లో ఎందుకు తిరుగుముఖం పడుతున్నాము అనేది ఆలోచించవలసిన విషయం.
గుజరాత్ కు చెందిన 37 ఏళ్ళ నంద బరియా ప్రస్తుతం 7 నెలల కడుపుతో ఉన్నారు.కానీ ఆవిడ 3 నెలలు నిండేవరకు తాను ఉన్న ఊరు కు 100 కిలోమీటర్ ల దూరం లో జరుగుతున్న భవన నిర్మాణ సంస్థలో పని చేయవలసి వచ్చింది.అన్ని రోజులు కూడా ఆమె మధ్యాహ్నం భోజనం సమయంలో జొన్న రొట్టెలను మాత్రమే తినేవారు అలాగే రాత్రి భోజనంలో పల్చటి పప్పు అన్నం తిని సరిపెట్టుకునేవారు.ఆమెకు రోజు వచ్చే కూలి 300 లతో సమతులాహారం గాని వైద్య సహాయం కానీ అందుబాటులో లేవు.తరువాత జనవరిలో ఆమె తన సొంత ఊరికి వచ్చాక స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్లగా అది మూసి వేసి ఉంది.తనకు 3 నెలలు నిండిన వెంటనే అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ చేసుకున్నానని కానీ ఇంతవరకు తనకి రావలసిన ఎలాంటి సహాయం అందలేదని ఆమె తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో భాగంగా గర్భవతులకు మంచి పోషకాహారంతో పాటు 6000 నగదు సహాయాన్ని 3 వాయిదాలలో ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయాలి,కానీ ఇప్పటివరకు అలాంటిదేమి జరగలేదు.
కాకపోతే ఇప్పుడు లొక్డౌన్ కారణంగా కోట్లాదిమందికి ప్రయోజనం చేకూర్చే కీలకమైన ప్రభుత్వ పథకాలకు అంతరాయం కలిగింది.అదే కాకుండా చాలామంది అంగన్వాడీ కార్యకర్తలను కరోనా పరిస్థితులు అధ్యయనం చేసి ప్రజలకు దానిపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించేలా నియమించారు.చాలామంది ఇంకా వారి కేంద్రాలకు తిరిగి రాలేదు.ఈ కారణంగా అంగన్వాడీలు పూర్తిగ తెరుచుకోలేదు.
అసలు మన దేశంలో పోషకాహార లోపం పెరగడానికి కారణం ఏంటి??ఈ విషయంలో మన దేశం అసలు ఎందుకు తిరోగమిస్తుంది?జాతీయ గణాంకాల ప్రకారం ఐదేళ్ల క్రితం కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
కోవిడ్ వ్యాప్తి కి ముందు 22 రాష్ట్రాలలో ఈ సర్వే జరుపగా మిగిలిన రాష్ట్రాల్లో లాక్ డౌన్ తర్వాత సర్వే చేసారు.2015 -16 సర్వే తో పోలిస్తే పిల్లల్లో పోషకాహార లోపం 44 శాతం నుండి 55 శాతానికి పెరిగింది.
ఇంకా చాలామంది మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారు.పేదవారిలో ఈ సమస్య అధికంగా ఉండడం వల్ల వారికీ పుట్టే పిల్లలు కూడా చాల బలహీనంగా ఉంటారు.దీనికి ముఖ్య కారణం వారికి సరైన పోషకాహారం అందకపోవడమే! పోషకాహారం అందకపోవడానికి కారణం వారు తరచూ వలసలు వెళ్లడమే..వీరు ఒకే స్థలంలో ఉంటె కనీసం వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అయినా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కానీ వారు వేరే వేరే జిల్లాలకు తరచుగా మారుతూ ఉండడం వాళ్ళ వారికి సంబందించిన వివరాలు ఏ జిల్లాలోను రిజిస్టర్ కావు.తద్వారా వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు చేరువ కావు.వీరిలో చాల మందికి ఆధార్ కార్డు కూడా లేదు.బ్యాంకు లో ఖాతాలు కూడా ఉండవు.అందుకే వీరికి ఎలాంటి పథకాలు అందవు.ఒక్కొక్కసారి ఆధార్ కార్డు అప్డేట్ కాకపోయినా,మహిళల కేర్ అఫ్ అడ్రస్ లు మారకపోయినా కూడా ఇలాంటి సమస్య వస్తుంది.
అవసరమైన వారికి అన్ని పథకాలు సులువుగా,ఖశ్చితంగా అందించేందుకు సహాయపడేలా ఆధార్ వ్యవస్థను రూపొందించినప్పటికీ కూడా అదే చాలసార్లు వారికి అడ్డంకిగ నిలుస్తుంది.ఎందుకంటే దానిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయవలసి వచ్చిన కూడా ప్రభుత్వ సంస్థల చుట్టూ తిరగవలసి రావడం వల్ల అన్నిసార్లు తిరగలేక అలాగే ఆ మార్పు చేయకుండా వదిలేస్తున్నారు.తద్వారా ఆధార్ కార్డు లో ఏదొక తేడా ఉండడం,వివరాలు సరిపోకపోవడం వల్ల వారికీ పథకాలు అందడం లేదు.రోజూ కూలి చేసుకుని ప్రతిరోజూ సంపాదిస్తే కానీ తినడానికి లేని పేదవారు ఎన్ని రోజులు పనిచేయడం మానేసి ప్రభుత్వ సంస్థల చుట్టూ తిరుగుతారు? చివరగా ఎన్ని పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసిన కూడా దానిని అర్హులకు చేరేలా అధికారులు కూడా కృషి చేసినప్పుడే అవి సక్రమంగా వినియోగమవుతాయని మనం గుర్తించాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.