నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొత్తపేట మండలంలో ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు శుక్రవారం అదనపు పోలీసు బలగాలతో గ్రామాల్లో కవాతు నిర్వహించారు. మండలంలోని కొత్తపేట, వాడపాలెం, వానపల్లి , అవిడి,పలివెల,బిళ్లకుర్రు సాయుధ బలగాలతో కవాతు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కొత్తపేట ఎస్సై శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.