గుంటూరు కు చెందిన ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా ఈరోజు సోము వీర్రాజు గారి అధ్యక్షతన వారి అనుచరులు 100 మందితో కలిసి రాష్ట్ర మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ఆధ్వర్యంలో భాజాపా లో చేరారు.
నాగుల్ మీరాగారు గత కొంతకాలంగా ముస్లిం హక్కులకై ఎన్నో పోరాటాలు చేసి హక్కులు కాపాడిన అపార అనుభవం కలవారు.అంతే కాకుండా ముస్లిం పేద విద్యార్థులకు ఆర్ధిక భరోసా కల్పించిన వ్యక్తి గా షేక్ బాజీ పేర్కొన్నారు.పార్టీ లో చేరిన నాగుల్ మీరా మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న అన్ని ముస్లిం కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాడతామని అన్నారు.అయితే భారతదేశం లో ముస్లింగా పుట్టినందుకు గర్వపడుతున్నానని, మోడీ గారి నాయకత్వం లో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని,ముస్లిం మహిళల సాధికారత కు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావటం వల్ల పార్టీలో చేరితే ముస్లిం లకు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున పార్టీ కి ఆకర్షితుడినై ఈరోజు నా అనుచరులతో పార్టీ లో చేరటం జరిగింది అని నాగుల్ మీరా అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిజాముద్దీన్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మౌలాలి, సుభాని, భాషా, దస్తగిరి, గౌస్ లు పార్టీలో చేరారు.