ఆధునిక పద్దతి లో రొయ్యల పెంపకం 1980 లో మొదలు అయ్యింది ,ఇండియా లో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ పెంచేందుకు అంతే కాకుండా హాచేరీస్ మరియు ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రొయ్యల చెరువులకు అనుమతి ఇచ్చింది . అప్పుడు టైగర్ అనే రకాన్ని ఎక్కువ గ ఉత్పత్తి చేసేవారు . దీనిని ఇండియన్ వైట్ ష్రిమ్ప్ అని కూడ పిలిచే వారు . ఆ రోజుల్లో ఏ రంగం లో డబ్బులు పోగేసుకున్నవారు ఎందరో వున్నారు

తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత వైట్ స్పాట్ సిండ్రోమ్ అనే ఒక వైరస్ వచ్చి చాలా పెద్ద మొత్తం లో రైతులుకు చాల రోజుల పటు నష్టాలు మిగిల్చింది . సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా కొన్ని రోజుల పటు కోస్టల్ వాటర్స్ లో రొయ్యల పెంపకాన్ని నిషేదించింది . కొన్ని రోజుల తర్వాత భారత ప్రభుత్వం 5 ఎకరాల విస్తీర్ణం లో పంట ని సాగు చేసుకొనేల ఒక కొత్త చట్టాన్ని అమలు చేసింది . 2000 ససంవత్సరం నాటికీ ఈ రంగం రొయ్య ఎదుగుదల , వైట్ స్పాట్ , మరియు అనేక జబ్బుల కారణం గ చాల ఇబ్బందులు పడింది . 

దీనికి కారణం నాణ్యత గల పిల్ల ను ఉత్పత్తి చేసే హాచేరిలు లేకపోవడమే . అప్పుడే భారత దేశం ఓక కొత్త రకమైన మరియు జబ్బలులను తట్టుకోగలిగే ఒక రకమైన జాతి ని ప్రవేశ పెట్టాలి అని 2008 లో అనుకొంది . అప్పుడే వెనామీ మన ముందుకు వచ్చింది . కొన్ని రోజుల పటు మన దేశం ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ , బిజినెస్ వంటి అంశాలలో వెనామీ ని పరీక్షించింది . అనేక పరీక్షల తర్వాత వెనామీ ని ఒక గొప్ప ఎంపిక గ అంటే కాకుండా దీనిని ఉత్పత్తి చెయ్యడం కూడా దెగ్గర లో వున్నా హేచరీలలో సాధ్యం ఆవుతుంది అని నిరాదరించారు .
ఏంటో మంది హాచేరిలు నిర్మించి రొయ్య పిల్లను ఉత్పత్తి చెయ్యడం మొదలు పెట్టారు .

2) 2010-2019 రొయ్య కు బంగారు యుగం

ఈ సమయం లో టైగర్ రొయ్య ను సాగు చేసే వారు మెల్లగా వెనామీ కి మారడం మొదలు పెట్టారు . దీనీతో మరిన్ని హాచేరీలు మరియు మేత పరిశ్రమలు వచ్చాయి . ఈ రోజు 90 శాతం మందికి పైగా వెనామీ రొయ్య ను  సాగు చేస్తున్నారు . 

వెనామీ రొయ్య ఉత్పత్తి వివరాలు ఇలా

          2010-142000 
           2011-252000

           2012-256000
           2013-315000
           2014-424000
           2015-487000
           2016-550000
           2017-701000
           2018-752000
           2019-805000
           2020-602000 టన్నులు 

ఇండియా లో వచ్చిన ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ మరియు హెపటో పాంక్రటిక్ డీసీసీ వంటి జబ్బుల వల్ల చాల మంది పెట్టుబడిదారులు ఇండియా నుండి మెక్సికో కి వెళ్లారు . 2013 – 2016 మధ్యలో రొయ్యలు మంచి లాభాన్ని తెచ్చి పెట్టాయి . ఆ డబ్బుని చాల మంది ఫీడ్ ప్యాక్టరీల మరియు హాచేరీలలో పెట్టుబడి పెట్టారు . ఇది రొయ్య ఉత్పత్తి పెరగడానికి చాల కారణం అయ్యింది . ఇండియా లో 160000 ఎకరాలలో రొయ్యల సాగు జరుగుతోంది . ఇప్పటి వారికి ఒకే సంవత్సరం లో 805000 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఒక సంవత్సరం లో ఎగుమతి అయ్యాయి .

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి , మరియు కృష్ణ జిల్లాల లో ఎక్కువ గ ఈ రొయ్యల సాగు జరుగుతుంది . ఇండియా లో ఈ ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతుంది . ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు పట్టా రాష్ట్రాలు ఆయన ఒడిశా , వెస్ట్ బెంగాల్ కి కూడా రొయ్యల పెంపకం అభివృద్ధి చెందుతుంది .