హైదరాబాద్ రాజధానిలోని పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

నాగోలు, కొత్తపేట, ఎల్‌.బి.నగర్‌, రామంతాపూర్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, రాయదుర్గం, ముషీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి.

విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.