టెక్నాలజీ (Technology) వార్తలు (News)

బులెట్ ప్రూఫ్ ట్రాక్టర్ – ఒక రైతు వినూత్న ఆలోచన

ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా మధ్య ఎప్పటినుంచో జలవివాదం కొనసాగుతోందన్నా విషయం అందరికి తెలిసిందే! ఈ నేపథ్యంలో హరియాణాలోని సోనీపత్‌ జిల్లా ఖరమపుర్‌ గ్రామానికి చెందిన రాజేంద్ర అనే రైతు పొరుగు రాష్ట్రం రైతుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేసి మరీ తన ట్రాక్టర్‌ను బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చారు. దీనికి సీసీటీవీ కెమెరాలతో పాటు లోపల ఏసీ, జీపీఎస్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం సరిహద్దు ప్రాంతం కావడంతో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భాలు చాల ఉన్నాయి. ‘‘ఈ సమస్య నుంచి నన్ను నేను కాపాడుకోవడానికే ట్రాక్టర్‌ను బుల్లెట్‌ ప్రూఫ్‌ చేయించాను. గత వారం నేను నా సోదరుడితో పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాపై దాడి చేశారు. కాల్పులు కూడా జరిపారు. ఆ సమయంలో ఈ ట్రాక్టర్‌ కారణంగా మేము సురక్షితంగా బయటపడ్డాము’’ అని రాజేంద్ర వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.