అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో తూగుతూ టెంపో నడపడం వల్ల స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న చిన్నారి మృతి చెందాడు. మచ్చబొల్లారం 7 టెంపుల్ వద్ద 12 ఏళ్ల బాలుడిని టెంపో ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. టెంపో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చిన్నారిని ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారవ్వడంతో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్నపోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.