కరోనా వైరస్‌ విజృభిస్తున్న కారణంగా పంజాబ్‌ ప్రభుత్వం మహమ్మారి వ్యాప్తి కట్టడికి ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నా కూడా వాటిని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించుకుని మార్చి 31 వరకు విద్యా సంస్థలన్నీ మూసివేయనున్నట్టు తెలిపారు. ఇంకా సినిమా థియేటర్లు 50శాతం సామర్థ్యంతో నడిచేందుకు అనుమతించారు.
కుటుంబ సభ్యులు/బంధువులతో పరిమిత సంఖ్యలో తమ ఇళ్లలోనే కార్యక్రమాలు చేసుకోవాలని, ప్రజలంతా రెండు వారాల పాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో మాత్రం ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు, వాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చినప్పటికీ 20మందికి మించి హాజరు కావొద్దని సూచించారు. ఆయా జిల్లాలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు తెలిపారు. అలాగే, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌ మాత్రం ఆదివారం పూర్తిగా మూసే ఉంచాలని ఆదేశించారు. పరిశ్రమలు, అత్యవసర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టంచేశారు.