కర్నాటకలో హుక్కా బార్లు యువతలో డ్రగ్స్ వినియోగాన్ని ప్రేరేపిస్తున్నాయని వీటిని నిషేధిస్తామని శాసనమండలిలో విపక్ష నేత ఎస్ఆర్ పాటిల్ స్పష్టం చేశారు. కొన్ని హుక్కా బార్లు డ్రగ్ సరఫరా కేంద్రాలుగా మారాయనే విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతోనే వీటిపై కఠిన చర్యలు చేపడుతున్నట్టుగా రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. వీటివల్ల నేటి యువత శక్తి సామర్ధ్యాలపై ప్రభావం చూపిస్తుందని ఎస్ఆర్ పాటిల్ అన్నారు. హుక్కా బార్లను మూసివేయరాదని తనపై ఒత్తిడి వస్తున్నా వీటి మూసివేత దిశగా చర్యలు చేపడతామని తాను సభకు హామీ ఇస్తున్నానని హోంమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.