తెలంగాణాలో ఇప్పుడు విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. గత 24 గంటల వ్యవధిలో 313 కరోనా కేసులు నమోదు అయ్యాయి. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలో రెండు బాలికల పాఠశాలలో 37 మంది కరోనా సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

జగిత్యాల జిల్లా బాలికల గురుకుల పాఠశాలలో 32 మంది విద్యార్థులు, 5గురు టీచర్లకు కరోనా సోకింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో రెండు వందల మంది విద్యార్థులు ఉండగా, వారిలో 20 మంది జ్వరంతో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 17 మంది బాలికలు, ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారిని వసతి గృహం లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.

సిరిసిల్ల జిల్లా కస్తూర్బా బాలికల పాఠశాలలో 15 మందికి కరోనా ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 15 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతుండటం తో పరీక్షలు నిర్వహించిన క్రమంలో వీరికి కరోనా పాజిటివ్ గా తేలింది. పాఠశాల లోని 6, 7 ,8, 9 తరగతులకు చెందిన 62 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి కరోనా నిర్ధారణ అయిందని, ఐసోలేషన్ లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నామని మండల వైద్యాధికారి తెలిపారు.