జైపూర్ మెట్రో ఎప్పుడు సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆదాయ మార్గాలను పెంచుకోవడం కోసం రైల్వే కోచ్‌లను బర్త్ డే పార్టీలకు,ఇతరత్రా కార్యక్రమాలకు అద్దెకు ఇస్తామని, నాలుగు గంటల కార్యక్రమానికి రూ.5000 , ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకేసారి కస్టమర్స్ ఎన్ని కోచ్‌లనైనా అద్దెకు తీసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మెట్రో ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో తాజాగా ఇలాంటి సరికొత్త కార్యక్రమాలను లాంచ్ చేస్తోంది.