క్రైమ్ (Crime) వార్తలు (News)

ఒంగోలులో ప్రేమజంట ఆత్మహత్య

ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని పెళ్లూరు వద్ద శుక్రవారం మధ్యాహ్నం రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. యువతీ యువకులు ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్నట్లు ప్రాథమిక సమాచారం. యువకుడు చీమకుర్తి మండలం గుడివాడ గ్రామానికి చెందిన మద్ది వెంకటసాయి కృష్ణగా గుర్తించారు. యువతి స్వస్థలం చీమకుర్తిగా భావిస్తున్నారు. ఒంగోలు రైల్వే సీఐ రామారావు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.