ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజైన మరుసటి రోజే అంటే ఫిబ్రవరి 27 నుంచి అంటే గత 20 రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను కంపెనీలు నిలిపేశాయి. ఆయిల్ కంపెనీలు ధరలు పెంచకుండా ప్రభుత్వమే చూసుకుంటోంది. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.4, డీజిల్‌పై రూ.2 నష్టపోతున్నట్లు ఆ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ధరల నీళుళ్పుదలకు ముందు బ్యారెల్ ధర 64.68 డాలర్లుగా ఉండగా, ఇప్పుడది 68.42 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో రూపాయి విలువ కూడా పడిపోవడంతో తాము నష్టపోతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.