అంతర్జాతీయం (International) వార్తలు (News)

థర్డ్‌ వేవ్ తో పారిస్ విలవిల

బ్రిటన్‌లో కొత్తగా బయటపడిన వైరస్ కేసులు ఫ్రాన్స్‌లో రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు, దీంతో పారిస్‌ దాని ఉత్తర ప్రాంతంలో నెల రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించినట్లు ప్రెసిడెంట్‌ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌ తెలిపారు. రూపాంతరం చెందిన వైరస్‌ కేసులు ప్రస్తుతం 75 శాతానికి చేరాయని, దీంతో దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రవేశించిందని ప్రధానమంత్రి జీన్‌ క్యాస్టెక్స్‌ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే! అయితే దేశంలోని ప్రతి 10 వేల మంది జనాభాలో సుమారు 400 మంది వైరస్‌ బారిన పడుతుండడంతో దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో కరోనా బాధితులు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లలో చేరుతున్నట్లు అధికారులు వివరించారు.

ఫ్రాన్స్‌లో గడిచిన 24 గంటల్లో సుమారు 35,000 కొత్త కేసులు నమోదు కాగా, వందల సంఖ్యలో మృతిచెందారు. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో లాక్‌డౌన్‌ విధించమని ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నాకూడా దేశ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించలేకపోయినందువల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఇప్పటివరకు 5 మిలియన్‌ల మందికిపైగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా వ్యాక్సినేషన్‌ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలతో ఫ్రాన్స్‌, యూరోపియన్‌ దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.