గురువారం శ్రీవారిని 50,087మంది భక్తులు దర్శించుకుని, 25,466మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.గురువారం భక్తులు వేసిన కానుకలు మరియు నాణేలు లెక్కించగా చాలా రోజుల తర్వాత రూ.5.21 కోట్ల ఆదాయం లభించింది. ఇది పాత రికార్డ్ బ్రేక్ చేసింది. కరోనా ప్రభావం శ్రీవారి హుండీ ఆదాయం మీద కూడా ప్రభావం చూపించింది. ఇప్పుడు కొంచం కరోనా కట్టడి అయ్యిందనే ఉద్దేశ్యంతో తిరుమల దర్శించే భక్తుల సంఖ్యా పెరిగి హుండీ ఆదాయ కూడా పెరిగింది. టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రూ.300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో భక్తుల సంఖ్య పెరిగింది.