తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం పేరూరులోని ఓ బేకరీలో థమ్స్ అప్ కూల్‌డ్రింక్‌లో మూడు అంగుళాల పాము దర్శనమిచ్చింది. షాపులో కూల్‌డ్రింక్స్‌ సర్దుతుండగా, థమ్స్‌ అప్‌ బాటిల్లో పాము కనిపించడంతో షాపు యజమాని భయంతో వెంటనే సదరు సప్లయార్స్‌కి కంప్లైట్‌ చేసి స్టాక్‌ తిరిగి పంపించాడు. ఈ స్టాక్ మూడురోజుల క్రితమే ఈ బాటిల్ ను సప్లై చేసినట్లు షాపు యజమాని పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగింది అమలాపురంలో అయినా కానీ ఏపీ మొత్తం వైరల్ అవడంతో చాలామంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.