వరుసగా ఐదు రోజుల నుంచి నష్టాల్లో పయనిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాలతో ప్రారంభమై అదే తీరులో కొనసాగుతున్నాయి. ఉదయంసెన్సెక్స్‌ 48,881 వద్ద మొదలైన సూచీలు 9:32 గంటల సమయానికి సెన్సెక్స్‌ 536 పాయింట్లు నష్టపోయి 48,667 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 14,471 వద్ద మొదలు పెట్టి 182 పాయింట్లు దిగజారి 14,369 వద్ద ట్రేడవుతోంది.

దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ , కొటాక్‌ మహీంద్రా షేర్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలోఉన్నాయి.