చొరబాటుదారులకు అడ్డుకట్టవేసేందుకు సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుని చొరబాటుదారులు, కార్మికులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు, వారికి ఆశ్రయం కల్పించేందుకు సాయం చేసే వారిపై ఉక్కుపాదం మోపబోతోంది. ఎవరైనా చొరబాటు దారులకు సాయం చేస్తూ పట్టుబడితే 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు మిలియన్ రియాళ్ల జరిమానా విధిస్తామని సౌదీ అధికారులు కీలక ప్రకటన చేశారు. మిలియన్ రియాళ్లు అంటే మన కరెన్సీలో దాదాపు ఒక కోటి 93 లక్షల రూపాయలు. సౌదీ అరేబియాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతోనే ఇలాంటివారిపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఇక్కడ నివసిస్తున్నవారు ఒకసారి ఆలోచించుకోవాలని, తప్పు చేస్తూ పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.