వార్తలు (News)

వర్షాలకు వాగులో కొట్టుకుపోయిన 400 గొర్రెలు!!

అనంతపురం జిల్లా నల్లమడ మండలం శ్రీరెడ్డి వారి పల్లి గ్రామ సమీపాన చెరువు వద్ద శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 1500 గొర్రెల మంద ఉన్న బాపనయ్య కుంట వర్షపు నీటితో నిండిపోయి కట్ట తగ్గడంతో వర్షపు నీటి ప్రవాహం గొర్రెల మంద మీద పడి ప్రవాహానికి గొర్రెలు నీటిలో కొట్టుకుపోయి సమీపానగల చెరువులో చేరాయి. ఈ ప్రమాదంలో 400 వందలకు పైగా గొర్రెలు మృతి చెందినట్లు బాధిత కాపరులు వీర నారప్ప శంకర, కుల్లాయప్ప కిరణ్ కుమార్ పెద్ద వీర నారప్ప తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.

వాగు వెంబడి పరిసర పొలాలలో చెల్లాచెదురుగా పడి మృతి చెందిన గొర్రెలను కాపరులు పరిసర గ్రామాల ప్రజలు వెతికి వీధికి ఒక చోటకు తెచ్చే ప్రయత్నం సాగించగా ప్రభుత్వ వైద్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •