టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఛత్తీస్‌గఢ్‌లో 885 ఎకరాల్లో 80 వేల మొక్కలు నిర్మాణం.. మానవ నిర్మిత అడవి??

ఛత్తీస్‌గఢ్‌ లో ఒక అటవీ ప్రాంతం.. తర్వాత సున్నపురాయి గనుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరపడంతో చెట్లు మచ్చుకైనా కనిపించకుండా పోయి 17 ఎకరాల విస్తీర్ణం నిర్జీవ ప్రదేశంగా మారిపోయింది. దీంతో అక్కడ తిరిగి మళ్ళీ అడవిని నిర్మించేలా సంకల్పించిన ప్రభుత్వం 885 ఎకరాల్లో 80 వేల మొక్కలను నాటడం ద్వారా దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడవిని సృష్టించేందుకు ప్రణాళిక వేసింది. దీనికి రూ.3 కోట్లను వెచ్చించడంతో దుర్గ్‌ జిల్లాలోని మూతపడిన నందిని లైమ్‌స్టోన్‌ సైట్‌ ప్రాంతం మళ్లీ పచ్చదనాన్ని సంతరించుకోనుంది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూడేళ్లపాటు ఇక్కడ అటవీ పునర్నిర్మాణాన్ని కొనసాగించనున్నామని, ఫలితంగా ఇక్కడి అటవీ ప్రాంత విస్తీర్ణం 2,500 ఎకరాలకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. గనుల తవ్వకాలు జరిగిన ప్రాంతాలను తిరిగి సహజ ఆవాసాలుగా ఎలా మార్చవచ్చన్నది ప్రపంచానికి తెలిపేలా ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక పక్షులతో పాటు వలస విహంగాలకు విడిదిగా, పర్యావరణ పర్యాటకానికి కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    78
    Shares
  • 78
  •  
  •  
  •  
  •