వార్తలు (News)

శ్రీవారికి రూ.1.8 కోట్ల స్వర్ణనందకం సమర్పించిన భక్తుడు!!

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఎం.ఎస్‌.ప్రసాద్‌ రూ.1.8 కోట్ల విలువైన స్వర్ణ నందకాన్ని విరాళంగా అందించారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారికి స్వర్ణ ఆభరణాన్ని బహూకరించారు. స్వర్ణ నందకం కోసం 6.5 కేజీల బంగారాన్ని వినియోగించినట్టు తెలిపారు.

‘శ్రీవారికి అన్నమయ్య ద్వారా శ్రీ మహావిష్ణువు నందకాన్ని అందించిన తరహాలో ఓ స్వర్ణ నందకం తయారుచేయాలని సంకల్పించాం. అందులో భాగంగా ప్రస్తుతం స్వామికి ఉన్న ‘సూర్యకఠారి’ (ఖడ్గం) కొలతలతో స్వర్ణ నందకాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించాం’ అని ప్రసాద్‌ వివరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •