టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు కసరత్తు??

తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సెకండియర్‌ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షల్లోని మార్కులను ప్రాతిపదికగా తీసుకొని పాస్‌ చేశారు. మరి ఫస్టియర్‌ విద్యార్థులకు ఏ ప్రాతిపదిక లేకపోవడం, 35 శాతం మార్కులు తీసుకోవడానికి కొందరు విద్యార్థులు విముఖంగా ఉండటంతో పరీక్షల నిర్వహణకే విద్యాశాఖ మొగ్గు చూపుతోంది. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది.

తాజాగా పరీక్షల సమయాన్ని కుదించాలని, గతంలో సమయం మూడు గంటలు ఉండగా, కరోనా నేపథ్యంలో గంటన్నరకు కుదించాలని యోచిస్తున్నారు. అందువల్ల సెకండియర్‌ విద్యార్థులకు వచ్చే నెల్లో ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రశ్నపత్రాలను కూడా సులువుగా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి మళ్లీ ఫీజులు చెల్లించనవసరం లేకుండానే, గతంలో చెల్లించిన వారికి అవకాశం ఇవ్వనున్నా రు. గతంలో ఫీజు చెల్లించని వారు ఇప్పుడు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    284
    Shares
  • 284
  •  
  •  
  •  
  •