జాతీయం (National) వార్తలు (News)

ఏటిఎం లావాదేవీలపై అదనపు భారం!!

నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటికి మించి చేసే నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీపై ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఇటీవల బ్యాంకులకు అనుమతిచ్చింది. బ్యాంకులు ప్రస్తుతం వినియోగదారుల నుంచి ఒక్కో అదనపు లావాదేవీకి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, నిర్వహించేందుకు వ్యయాలు పెరగడం, ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులు పెరిగిన నేపథ్యంలో సాధారణ ఖర్చులకు గానూ ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు, అయితే ప్రస్తుతం పెంచిన ఛార్జీల ప్రకారం 2022 జనవరి 1 నుంచి నెలవారీ ఉచిత లావాదేవీలు ముగిశాక చేసే ప్రతి లావాదేవీపై ఖాతాదారులు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది.

సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ప్రతి నెలా 5 ఉచిత లావాదావీలు(ఆర్థిక, ఆర్థికేతర కలిపి) నిర్వహించుకోవడాన్ని కొనసాగించడం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం. మెట్రో కేంద్రాల్లో ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి 3, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను అనుమతిస్తారు. అటు ఎస్‌బీఐ ఏటీఎం, బ్యాంకు బ్రాంచిల ద్వారా చేసే నగదు విత్‌డ్రాలపై సవరించిన సేవా రుసుములు 2021 జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు, బీఎస్‌బీడీ ఖాతాదారులకు కూడా ఈ రుసుములు వర్తిస్తాయని, ఒక నెలలో బ్యాంకు బ్రాంచి, ఏటీఎం వద్ద కలిపి నాలుగు ఉచిత నగదు లావాదేవీలకు మించి చేసే ఉపసంహరణలపై రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. పరిమితికి మించి చేసే ఒక్కో కొత్త నగదు విత్‌డ్రా లావాదేవీకి రూ.15 సహా అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •