వార్తలు (News)

పోటీ పరీక్షలపై కేంద్ర మంత్రి జితేంద్రప్రసాద్‌కు లేఖ: కేటీఆర్‌!!

పోటీ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచో కోరుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలసి ప్రస్తావించగా ఈ విషయాన్ని పరిశీలిస్తామని అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హామీ కూడా ఇచ్చారు. అయితే కరోనా పరిస్థితుల క్రమంలో ఈ ఏడాది పరీక్షలు తప్పనిసరిగా ప్రాంతీయ భాషల్లో పెడతారని ఆశించిన వారికి షాక్ ఇస్తూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ ప్రకటించింది.

నోటిఫికేషన్‌లో పరీక్షలు హిందీ, ఇంగ్లిషులోనే నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎ్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లలోకానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టులతోపాటు అస్సామ్‌ రైఫిల్స్‌లో రైఫిల్‌ మ్యాన్‌ ఉద్యోగాల కోసం కూడా తాజాగా స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించడం కూడా ప్రారంభించారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 31. దరఖాస్తుల గడువు ముగిశాఖ పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తామని కమిషన్‌ పేర్కొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •