వార్తలు (News)

కాచిగూడ- కరీంనగర్‌ మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన డెమొ రైలు??

కాచిగూడ-కరీంనగర్‌ మధ్య 2020 మార్చి 23న రద్దు చేసిన రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు నేటి నుండి తిరిగి ప్రారంభించనున్నారు. డెము ప్రత్యేక రైలుపేరుతో దీనిని నడిపించేందుకు ఏర్పాట్లు చేయగా రైలు నంబరు 07793/07794తో ప్రయాణికులకు సేవలు అందనున్నాయి.

ఇది ప్రతి రోజూ కాచిగూడలో ఉదయం 6 గంటలకు బయలుదేరి సీతాఫల్‌మండి, మల్కాజిగిరి, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ మీదుగా జిల్లాలోని మనోహరాబాద్‌కు 7.17, స్టేషన్‌ మాసాయిపేటకు 7.30, వడియారం స్టేషన్‌కు 7.40 గంటలకు చేరుకుంటుంది. మీర్జాపల్లికి 7.50, అక్కన్నపేటకు 8.00 గంటలకు చేరుకుంటుంది. జిల్లాలో ఈ రైల్వేస్టేషన్లలో మాత్రమే డెము రైలు ఆగుతుంది. నిజామాబాద్‌కు 10.30 గంటలకు, కరీంనగర్‌కు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై నిజామాబాద్‌, కామారెడ్డి మీదుగా జిల్లాలోని అక్కన్నపేటకు రాత్రి 7.47, మీర్జాపల్లి 7.58, వడియారం 8.08, మాసాయిపేటకు 8.19, మనోహరాబాద్‌కు 8.33 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి మేడ్చల్‌ మీదుగా కాచిగూడకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. జిల్లాలో ప్రతి స్టేషన్‌లో ఒక నిమిషం మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •