వార్తలు (News)

జులై 21వరకూ వర్షాలు తగ్గే అవకాశం లేదు!!

వాతావరణ శాఖ(IMD) ప్రకారం జులై 21వ తేదీ వరకూ వర్షాలు తగ్గే అవకాశం లేదు. బెంగాల్, సిక్కింగ్ రాష్ట్రాల్లో జులై 19వరకూ భారీగా కురిసి క్రమంగా తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

పశ్చిమ పెనిన్సులార్ ఇండియాలో రానున్న ఐదారు రోజులు వర్షానికి తడవవలసిందే! మధ్య మహారాష్ట్రలోని ప్రాంతాలైన కొంకణ్, గోవా, ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి.

పశ్చిమ హిమాలయ ప్రాంతం మీదుగా ఉత్తరప్రదేశ్ లోనూ 17జులై నుంచి 21జులై వరకూ పంజాబ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ లలో 18 జులై, 21 జులై భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో రానున్న 24గంటల్లో ఉరుములతో కూడి పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •