టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

అనంతగిరి కొండల్లో దొరికిన అరుదైన మొక్క!!

వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండల్లోని గడ్డి మైదానంలో కొత్త మొక్కను కనుగొన్నట్టు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బొటానికల్‌ గార్డెన్‌ నిర్వాహకుడు, వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.సదాశివయ్య తెలిపారు. ఈ మొక్కకు బ్రాకిస్టెల్మా అనంతగిరియెన్సె అని నామకరణం చేసినట్లు సదాశివయ్య తెలిపారు. ఈ మొక్క నిమ్మగడ్డి పెరిగే ప్రదేశాల్లో మాత్రమే చిన్న చిన్న రాళ్ల మధ్య పెరుగుతుందని, మొక్క ప్రస్తుతం 3 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉందని వెల్లడించారు.

ముదురు గోధుమ రంగులో సుమారు 2.5 సెంటీమీటర్లు పూచే ఈ పూలు మెలికలు తిరిగి ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. ప్రజాతికి చెందిన మొక్కల దుంపలను అనేక ప్రదేశాల్లో తినడమే గాక సుఖవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారని, ఇప్పటివరకు ప్రజాతికి చెందిన 38 మొక్కలను దేశంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారని, ఈ మొక్క 39వదిగా వివరించారు. కేవలం వంద మొక్కలు మాత్రమే ఉన్నందున అంతరించిపోయే మొక్కగా దీనిని గుర్తించామని చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •