వార్తలు (News)

ముంబయిలో భారీ వర్షాలతో రెడ్‌ అలర్ట్‌..!!

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ముంబయి విభాగం ప్రధాన అధికారి డాక్టర్‌ జయంత్‌ సర్కార్‌ సోమవారం రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మంగళవారం నుంచి రెండు రోజులపాటు నగరంలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు తెలిపింది. నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన పలు ఘటనల్లో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. భారీ వర్ష సూచనల నేపథ్యంలో నగరంలోని 407 శిథిల భవనాలను ముంబయి మహానగర పాలక సంస్థ ముందస్తుగానే గుర్తించి వాటిలో ఇప్పటివరకు 150 భవనాలను మాత్రమే కూల్చింది.

భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం సమీక్షించారు. శిథిల భవనాలు, కొండ చరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    6
    Shares
  • 6
  •  
  •  
  •  
  •