జాతీయం (National) వార్తలు (News)

నష్టాల్లో నేటి మార్కెట్ సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 351 పాయింట్ల నష్టంతో 52,784 వద్ద ట్రేడవుతుండగా .. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 15,826 వద్ద ట్రేడవుతున్నాయి. దేశీయంగా బ్యాంకింగ్‌, ఆర్థిక, లోహ, ఆటో, స్థిరాస్తి రంగ షేర్లు సూచీలను దెబ్బతీస్తున్నట్టుగా తెలుస్తుంది.

బీఎస్‌ఈ 30 సూచీలో టైటన్‌, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •