జాతీయం (National) వార్తలు (News)

నష్టాలతో ముగిసిన నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో మొదలై చివరి వరకు అదే బాటలో నడిచి నష్టాల్లోనే ముగిసాయి. ఈ నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 586 పాయింట్ల నష్టంతో 52,553 వద్ద స్థిరపడగా నిఫ్టీ 171 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, నెస్లే ఇండియా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫినాన్స్‌, టాటా స్టీల్‌, టైటన్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •