ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

వెల్లుల్లి టీ తో ప్రయోజనాలు తెలుసుకోండి..??

ఇండియాలో ప్రతి వంటిల్లుని ఆరోగ్య గని అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు వచ్చే ఆరోగ్య సమస్యలలో చాలావరకు మన వంటింట్లో ఉపయోగించే వాటితోనే దూరం చేసుకోవచ్చు. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది వెల్లుల్లి. వెల్లుల్లిని కూరల్లో వేయటం వల్ల ప్రత్యేక రుచి వస్తుంది. పరిగడుపున వెల్లల్లి రెబ్బలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో విషపదార్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్, యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లిని తింటే.. బాడీ మెటబాలిజం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కేన్సర్లను, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తాయి. హైపర్ టెన్షన్, డయాబెటిస్‌ వ్యాధులను నివారించవచ్చని పరిశోధనలో వెల్లడైంది. మరి ఇన్ని సుగుణాలు ఉన్న వెల్లుల్లితో టీ చేసుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చో కదా.. ఇప్పుడు వెల్లుల్లితో ఉపయోగాలేంటో చూసేద్దామా..!

శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపించడంలో వెల్లుల్లి టీ దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతీరోజూ వెల్లుల్లి టీ తాగితే.. బరువు నియంత్రణలో ఉంటుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి టీ తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు.. శరీరం చురుకుగా ఉండేలా చేస్తుంది. ఉదర సమస్యలను దూరం చేసి.. అజీర్తి, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది. శరీరంలో రక్తప్రసరణను పెంచి.. బీపీ అదుపులో ఉండేలా చేస్తుంది. ప్రతిరోజూ ఐదారు వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఘాటు తగ్గించుకునేందుకు కొంచెం తేనె కలుపుకుంటే తాగొచ్చు. జీర్ణ శక్తి పెంచడంలో కూడా వెల్లుల్లి టీ బాగా ఉపయోగపడుతుంది.

మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లిని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుందామా!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •