క్రైమ్ (Crime) వార్తలు (News)

గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో నేరస్తుడి అరెస్ట్!!

గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఘటన జరిగిన రోజు విజయ్‌తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిందా? లేదా ? అనే కోణంలో విచారిస్తున్నారు.

మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరి ఆచూకీ లభ్యమవ్వడంతో హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీసులు ఆమెను గుర్తించి మహిళను అదుపులోకి తీసుకొని ఘటనపై విచారించారు. అక్కా చెల్లెళ్లు మద్యం ఉపసంహరణ లక్షణాల(ఆల్కహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌)తో ఉన్నారని గుర్తించి అక్కడి ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. ఈ కేసులో బాధితురాలిని మహిళా పోలీసులు బుధవారం రహస్య ప్రాంతంలో విచారించి ఆమె స్టేట్‌మెంట్‌ను మరో మారు రికార్డు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    67
    Shares
  • 67
  •  
  •  
  •  
  •