జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు!!

కొత్త కారు కొనాలనుకునే వారి కోసం టాటా మోటార్స్ కార్లపై ఆకర్షణీయమైన ధరలు అందుబాటులో ఉన్నాయి. ఆగస్ట్ నెలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. టాటా టియాగో కారుపై క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.20 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

ఇక టాటా టిగోర్ కారు విషయానికి వస్తే.. ఈ కారుపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.20 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో రూ.20 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. మొత్తంగా రూ.40 వేల వరకు ప్రయోజనం లభిస్తోంది. టాటా అల్ట్రోజ్ కారుపైరూ.15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. టాటా నెక్సన్ కారుపై ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.15 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేలు ఉంది.

టాటా నెక్సన్ ఈవీ కారుపై రూ.15 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుండగా టాటా హరియర్ కారుపై క్యాష్ డిస్కౌంట్ కింద రూ.25 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.40 వేల వరకు తగ్గింపు ఉంది. ఇంకా టాటా సఫారి కారుపై రూ.25 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. అయితే కారు ఆఫర్లు వేరియంట్, మోడల్ ప్రాతిపదికన మారుతూ ఉండొచ్చు. ఇది ప్రాంతం ప్రాతిపదికన మారుతుంటుంది. అందువల్ల కారు కొనేందుకు ముందుగానే డీలర్‌షిప్స్ వద్దకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    17
    Shares
  • 17
  •  
  •  
  •  
  •