అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

తాలిబన్ల నుండి నిధులు తీసుకోవడానికి ఐఎంఫ్ నిరాకరణ!!

అష్రాఫ్ ఘని ప్రభుత్వాన్ని పడగొట్టిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను తమ చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే! అటు ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ఘన్ పరిస్థితి గురించి ఒకరకమైన గందరగోళం నెలకొనడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదన ఉండగా ఆ వాదనను నిజం చేసేలా, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి, తాలిబన్లకు షాకిచ్చింది.

ఆఫ్ఘనిస్తాన్ కు నిధులు ఇవ్వబోమని, ఇదివరకు కేటాయించిన నిధులను కూడా మంజూరు చేసే అవకాశం లేదని, ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టత కొరవడిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఐఎంఎఫ్ ప్రకటించింది. ప్రస్తుతం నిధులు నిలిపివేయడంతో మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై తాలిబన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •