క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

కశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన జేసీవో!!

కశ్మీర్‌లో ఉగ్రవాదులు చెలరేగడంతో రాజౌరి జిల్లాలోని ఠాణామండీ ప్రాంతంలో గురువారం భద్రతా దళాలు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి(జేసీవో) అమరుడవ్వగా మరొకరు గాయపడ్డారు. ఒక ఉగ్రవాది కూడా హతమైనట్టు అధికారిక వర్గాల సమాచారం!

‘ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతాదళాలు బుధవారం కార్డన్‌ సెర్చ్‌ మొదలుపెట్టిన క్రమంలో గురువారం ఉదయం కార్యోట్‌ కలాస్‌ ప్రాంతంలో వారు తారసపడగా దీంతో ఇరువర్గాల మధ్య ఫైరింగ్‌ మొదలైంది. ఉగ్రవాదులంతా నియంత్రణ రేఖ దాటి ఈ ప్రాంతంలోకి చొరబడ్డారని, ఎంతమంది వచ్చారో తెలియదని, ఎన్‌కౌంటర్ ప్రక్రియ కొనసాగుతోందని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •